వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన రామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామ్‌కు రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా సుష్మా అనే యువతి పరిచయం అయ్యింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా ఫోనుల్లో గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో సుష్మా తల్లిదండ్రులు ఆమె ప్రేమకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సుష్మా ప్రేమ కోసం ఇంటి నుంచి బయటికొచ్చి.. ప్రియుడిని వివాహం చేసుకుంది.
వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుండగా.. సుష్మ ఎప్పుడూ ఫోనులో గడపటం మొదలెట్టింది. అలా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. ఇంటి పనిని కూడా చేయకుండా ఫోనుతోనే గంటల పాటు గడిపేది. రామ్ ఎంత చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా సుష్మ పట్టించుకోలేదు. ఆపై రాజ్ తన భార్య సెల్‌ఫోన్ చూస్తే.. ఆమె పలువురితో నెట్‌లో చాట్ చేయడం గమనించాడు.
చివరికి రాజ్ థీమ్ పార్క్ వెళ్దామని.. తన భార్య, 3 నెలల బిడ్డతో కలిసి రామ్ వెళ్లాడు. అక్కడికెళ్లాక రామ్ రాక్షసుడిగా మారిపోయాడు. తన భార్యను తైలం చెట్ల మధ్య ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా.. మూడు నెలల పాపాయిని కూడా వదలకుండా హత్య చేశాడు. ఆపై ఆ ఇద్దరినీ దహనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
రెండు రోజుల తర్వాత స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సుష్మతో పాటు తన మూడు నెలల మనవడు కనిపించలేదని సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి సుష్మ భర్తను విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సుష్మను, మూడు నెలల పసికందును తానే చంపానని చెప్పడంతో సుష్మ తల్లిదండ్రులు, పోలీసులు షాకయ్యారు.