ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఆసియాలో భారత్ తర్వాత స్థానాల్లో వియత్నాం, థాయిలాండ్, పాకిస్థాన్, మయన్మార్ ఉన్నాయి.
భారత్‌లో లంచాలు ఇస్తేగానీ పనులు కావని ప్రధానంగా పాఠశాలలు, దవాఖానలు, గుర్తింపుపత్రాల జారీ కేంద్రాలు, పోలీసు, వినియోగ సేవల్లో అవినీతి రాజ్యమేలుతున్నదని ఈ సర్వేలో తేలింది. సగానికిపైగా ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోవడానికి లంచం ఇవ్వాల్సి వస్తున్నదని తెలిపింది.