దీనిపై ఆమె స్పందిస్తూ అనారోగ్యం కారణంగా తన అమ్మ ఈ వేడుకకు హాజరుకాలేక పోయారని చెప్పింది. కానీ అమ్మ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నామని, మిగతా బంధువులకు ఎలాంటి ఆహ్వానాలు ఇవ్వలేదని చెప్పింది. అయితే, త్వరలో కొడైకెనాల్‌లోని చర్చిలో బంధువులను పిలిచి వేడుక జరుపుతామన్నారు.
మతాంతర్ వివాహం కావడంతో ప్రత్యేక వివాహ చట్టంలో పేరు నమోదు చేసుకోవడం, అనుమతి రావడం కోసం షర్మిల - డెస్మంట్ రెండు నెలలు ఎదురుచూశారు. చివరికి కొడైకెనాల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వివాహానికి ఆమోదం తెలపడంతో ఇరువురు ఒక్కటయ్యారు.
మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల, అక్కడ ప్రత్యేక సైనికాధికారాల చట్టానికి వ్యతిరేకంగా దశాబ్దమున్నర పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసింది. చట్టసభల్లో పోరాడుతానని ప్రకటించి ఆమె, గతేడాది దీక్షను విరమించడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓటమిపాలైన విషయం తెల్సిందే.