అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... కేవలం మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
అయితే, జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆమెను గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.