ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందుకే రుణ వాయిదాలు, ఇతర చెల్లింపులను ఆలస్యమైనా బ్యాంకులు అనుమతించేలా ఆర్బీఐ ఆదేశాలిచ్చే ఆవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
'లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు, ఇతర వ్యక్తుల ఆదాయ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా రుణాలు, నెలవారీ వాయిదాలు ఆలస్యమైనా చెల్లింపునకు అనుమతివ్వాలనే డిమాండు ఇటీవల పెరిగిపోయింది. ఇప్పటికే ఈ అంశంపై భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) చర్చలు జరిపింది.