తమిళనాట సంక్రాంతి ప్రారంభమైనాయి. దాదాపు 60 ఎద్దులు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమైనాయి. వాటిని అదుపుచేసేందుకు 300 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది నంది తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.
సుప్రీంకోర్టు నిబంధనలను మీరకుండా జల్లికట్టు జరుపుకోవచ్చునని.. జల్లికట్టు కారణంగా జంతువులను హింసించరాదని, పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా తెలిపారు.