జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ల సంచారం కనిపించింది. ఇది కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. దీన్ని పసిగట్టిన భారత సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని సైన్యం భగ్నం చేసింది.
కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రమాకలే ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు కేంద్రం చేపట్టిన చర్యలను భగ్నం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలకు ఉగ్రమూకలు పూనుకుంటున్నట్టు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.