ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్

సోమవారం, 28 జనవరి 2019 (17:49 IST)
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్ - జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కాంతమంది సిద్ధారామయ్యకు మద్ధతు తెలుపుతూ ఆయనే మా సిఎం అంటూ చెప్పారు. దీంతో పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
 
తాజాగా పుట్టరంగశెట్టి, సోమశేఖర్ అనే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి కుమారస్వామిపై మండిపడ్డారు. మాకు సిఎం కుమారస్వామి కాదంటూ చెప్పారు. ప్రభుత్వం మేము ఏర్పాటు చేసింది. మాకే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ చెప్పారు. దీంతో కుమారస్వామికి ఆగ్రహం వచ్చింది. 
 
ఏంటి బెదిరిస్తున్నారా.. నేను చెబుతున్నా సిఎం పదవికి రాజీనామా చేస్తా. నాకు ఈ పదవి అవసరం లేదు. నా కారులో లెటర్ ప్యాడ్‌లు రెడీగా ఉన్నాయి. లెటర్ ప్యాడ్ చించి రాజీనామా లేఖను రాసిస్తా.. ఏమనుకుంటున్నారో జాగ్రత్త అంటూ కాంగ్రెస్ నేతలనే హెచ్చరించారు కుమారస్వామి. 
 
కుమారస్వామి అలా అనడంతో కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయిపోయారు. కుమారస్వామి అలా మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు అస్సలు ఊహించలేదు. కారణం గత కొన్నిరోజుల తాము ఎన్ని మాట్లాడినా కుమారస్వామి మాత్రం సైలెంట్‌గా ఉంటూ వచ్చారు అందుకే కాంగ్రెస్ నేతలు మరింత రెచ్చిపోయిన్నట్లుగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు