రియల్ హీరో.. భార్యకూతురు కోసం.. పులితో పోరాటం

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:35 IST)
సాధారణంగా సినిమాల్లో పులులతో, సింహాలతో పోరాడే వారిని చూసివుంటాం. అయితే నిజజీవితంలో భార్యా పిల్లలను కాపాడుకోటానికి ఓ కన్నడ వ్యక్తి చిరుతతో పోరాడి దాన్ని హతమార్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హసన్ జిల్లా హరిసెక్రె తాలూకా, బెండెకెరే ప్రాంతంలో భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నరాజగోపాల్ నాయక్ కుటుంబంపై పులి దాడి చేసింది. దీంతో వీళ్లు ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయారు. పులి భార్యా కూతురు మీదకు లంఘించే సరికి రాజగోపాల్ నాయక్ పులితో పోరాటం సాగించాడు.
 
వీరోచితంగా పోరాడి పులిని చంపేసి భార్యా కూతురును కాపాడుకున్నాడు. ఈ క్రమంలో రాజగోపాల్ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి అక్కడకు చేరుకున్న స్ధానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు