కేరళ రాష్ట్రంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. గతంలో ఒకసారి ఈ వైరస్ కనిపించింది. ఇపుడు వళింజమ్ అనే ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. అయితే, ఈ వైరస్ సోకిన బాధిత చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
తమ రాష్ట్రంలో కొత్తగా నోరోవైరస్ కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు. పైగా, కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో పళంజమ్‌లోని ఎల్ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రజారోగ్య పరిశోధనా కేంద్రానికి పంపించినట్టు తెలిపారు.
ఇదిలావుంటే, ఆహారం లేదా కలుషి ద్రవాల ద్వారా నోరోవైర్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా గానీ, అది సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్లగానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు తెలిపారు.