తనను ప్రేమించిన యువకుడు వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడనే విషయం తెలుసుకున్న ప్రియురాలు అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కుట్టిపురంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుట్టిపురానికి చెందిన యువతి, యువకుడు (26) ప్రేమించుకున్నారు. ప్రియుడిని మాట్లాడాలని పిలిపించిన యువతి కుట్టిపురంలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లింది. లాడ్జ్‌లో దిగిన కాసేపటికే వారిద్దరూ దిగిన గది నుంచి గట్టిగా అరుపులు రావడంతో లాడ్జ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇంతలో తీవ్ర రక్తస్రావంతో గిలగిలలాడుతూ యువకుడు గది నుంచి బయటపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. మరో యువతితో పెళ్లికి సిద్ధపడటంతోనే అతని మర్మాంగాన్ని కోసేశానని సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతిని రిమాండ్‌కు తరలించారు.