తాను రాసిన 'ఇట్స్ ఆల్వేస్ పాజిబుల్' పుస్తకాన్ని సినిమాగా తీస్తే ఆస్కార్ అవార్డు ఖాయమని ప్రముఖ సామాజికవేత్త, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆర్కేవీ స్టూడియోస్ బుధవారం జరిగిన 'తీగార్' ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌బేడి మాట్లాడుతూ... తీహార్ జైలుతో తన అనుబంధాన్ని, జైలులో ఖైదీల్లో నడవడికల్లో మార్పు తెచ్చేందుకు తాను చేపట్టి సంస్కరణలను గురించి తెలిపారు.
తమిళంలోకి అనువాదమైతే తాను సినిమా తీసేందుకు సిద్ధమేనని 'తీగార్' దర్శకడు పేరరసు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్తిబన్, భరత్, పేరరసు తదితరులతో పాటు కిరణ్వేడి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.