నోట్ల రద్దు ప్రభావం అతిపెద్ద టమోటా మార్కెట్‌పై కూడా పడింది. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్లు, ట్రక్ డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియాలోని రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన కోలార్ మార్కెట్ యార్డ్‌లో ఒక్క బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్‌గానీ లేకపోవడం ఆందోళనగా మారింది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కోలార్ లోని టమాటా మార్కెట్ దేశంలో అతిపెద్ద మార్కెట్‌గా ప్రసిద్ధి చెందింది. పింపాల్ గాన్, నాసిక్ తర్వాత దక్షిణ భారతదేశం అతి పెద్దదైన కోలార్ ..కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేవలం 70 కి.మీ ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ బ్యాంకు సదుపాయాలు, ఏటీఎం సెంటర్లు లేకపోవడంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు అష్టకష్టాలు పడుతున్నారు.
దీంతో తమ సిబ్బంది వేతనాల చెల్లింపు ఆలస్యం కానుందన్నారు. రైతులు నగదు చెల్లింపులకోసం ఒత్తిడి చేస్తున్నారనీ, చెక్ లను అంగీకరించడం లేదన్నారు. అయితే రైతుల, ఇతర వ్యాపారుల కష్టాల నేపథ్యంలో జాతీయ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు. త్వరలో టమోటా మార్కెట్ వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.