రూ.100 కోసం లేబర్ హత్య: నేలపై పడేసి..ఆగ్రాలో ఉద్రిక్తత..!

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:21 IST)
రూ.100 కోసం హత్య చేసేసిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వంద రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఆగ్రాలో ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జైకిషన్ స్థానిక దేవాలయంలో పని చేయించాడు. ఆ దేవాలయంలో పని చేసిన పప్పూ అనే కూలీ తనకు రావాల్సిన వంద రూపాయల కోసం జైకిషన్‌ను నిలదీశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన జైకిషన్ పప్పూను నేలపై పడేసి అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో, పప్పూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఇకపోతే.. విషయం తెలిసిన బాధితుడి కుటుంబ సభ్యులు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకుని మేజర్ ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. ఆస్తులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న మేజర్‌పై దాడిచేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మేజర్ ఉపాధ్యాయను సరోజినీ నాయుడు మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, జైకిషన్ కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి