పోర్జరీ కేసులో న్యాయవాది మరో ముగ్గురి అరెస్టు

బుధవారం, 1 జులై 2015 (21:20 IST)
పోర్జరీ సంతకాలతో ఒకరి ఆస్తి కాజేయాలని ప్రయత్నం చేసిన ఓ న్యాయవాది, మరో ఇద్దరు అడ్డంగా బుక్కయ్యారు. ఆస్తి యజమాని చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ముంబయికి చెందిన లాయర్ ఉమేష్ పి చారి, ఎస్టేట్ ఏజెంట్ ఎల్డీ నాయక్, మరో వ్యక్తి సావంత్ లు కలిసి కళాచౌకి నివాసి ప్రమోద్ దమాన్కర్ ఆస్తిని కొట్టేయాలని పథకం వేశారు. షాపును అమ్మివేసినట్లుగా పత్రాలు సృష్టించారు. దీంతో ప్రమోద్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారు సంతకాలు పోర్జరీ చేశారని పసిగట్టారు. లాయర్ సహా మరో ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని తేలిందని డీఎస్పీ వివరించారు. 
 
సాక్షి సంతకాలు చేసిన మరికొందరిపై కూడా తాము చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సంతకాలు చేసిన వారికి అవి నకిలీ పత్రాలు అని తెలుసో లేదో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గరుడ్ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి