లెఫ్టినెంట్ గవర్నర్ మిడ్‌నైట్ రైడ్.. ఎవరు.. ఎక్కడ? (Video)

ఆదివారం, 20 ఆగస్టు 2017 (11:01 IST)
పూర్వకాలంలో ప్రజల కష్టనష్టాలతోపాటు శాంతిభద్రతలు తెలుసుకునేందుకు మారు వేషాల్లో రాజులు రాత్రిపూట పర్యటించేవారని విన్నాం. పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే, ఇపుడు ఇలాంటి ఘటనే ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా మారు వేషంలో సంచరించింది ఎవరో కాదు... పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.
 
ఎలాంటి భద్రతా లేకుండానే వ్యక్తిగత సహాయకురాలితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి స్కూటర్‌పై పుదుచ్చేరిలోని ప్రధాన రహదారులు, ఇరుకురోడ్లలో సుమారు గంటపాటు తిరిగారు. ప్రజలు తనను గుర్తు పట్టకుండా చున్నీని తలపై కప్పుకొన్నారు. నైట్‌ డ్యూటీలో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారో, లేదో ఆమె తనిఖీ చేశారు. 
 
అనంతరం... పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని, మహిళలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని అభిప్రాయపడుతూ ట్విట్టర్‌లో ఒక సందేశం పోస్టు చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా ఆమె ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. 

 

A clip of Night Round done 'incognito' to check how safe was it for women++during late night hours.
Helped identify areas for improvement.. pic.twitter.com/1BeMsL1JQX

— Kiran Bedi (@thekiranbedi) August 19, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు