ఈ జల కాలుష్యం కారణంగా చెరువులు, నదులు, ఉప నదులు, ఇలా అన్నీ కలుషితమై పోతున్నాయి. ప్రధానంగా దేశానికి ప్రధాన జీవనాధారంగా ఉండే కీలక నదులు కూడా ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. గంగా, యమున వంటి పవిత్ర నదుల ప్రక్షాళన కోసం కేంద్రం నడుం బిగించింది. అయినప్పటికీ.. రవ్వంత కూడా పురోగతి లేదు.