అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖ్యమంత్రి జయలలితపై లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ బీలే కోప్పడ్డారట. చికిత్సకు ఏమాత్రం సహకరించక పోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఈ ఆస్పత్రికి బాస్‌ను అని అన్నాడట. దీనికి జయలలిత.. హల్లో డాక్టర్ బీలే 'ఈ రాష్ట్రం మొత్తానికి నేనే బాస్‌ను' అని నీరసంగా అన్నారట.
'అమ్మ' శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ఇంటెన్సివిస్ట్ గుర్తించారు. వెంటనే వెంటిలేటర్ సరిచేశారు. అయితే అప్పటికే ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు వైద్యులు నిర్ధారించి తదునుగుణంగా వైద్యం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక సోమవారం రాత్రి 11:30 గంటలకు జయ తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.