పబ్ జీకి యువత బానిసలైపోతున్నారు. ఆ గేమ్ ఆడుతూ.. ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. యువతే కాకుండా ఆడామగా, చిన్న పెద్దా అనే తేడా లేకుండా పబ్‌జీ ఆడుతున్నారు. అయితే తాజాగా ఒక యువకుడు పబ్ జిలో పడి ప్రాణాలే కోల్పోయాడు. నీళ్లనుకుని యాసిడ్ తాగేశాడు. అంతే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
రైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పబ్‌జి ఆడుతూ యాదవ్ దాహం వేయడంతో ఆ బ్యాగులోని యాసిడ్ బాటిల్‌ను మంచినీళ్లనుకుని బయటికి తీశాడు. ఇంకా అవి తాగేనీరు అనుకుని తాగేశాడు. శర్మ స్పందించే సమయానికే అతను మొత్తం తాగాడు. రైలు ధోల్పూర్ వద్ద ఆగనందున, యాదవ్‌కు చికిత్స అందించడం కుదరలేదు.