పెళ్ళిపేరుతో యువతిని లొంగదీసుకున్న ఎమ్మెల్యే సుపుత్రుడు!

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (13:16 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సుపుత్రుడు ఒక యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ యువతిని పెళ్లి పేరుతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉజ్జయిని జిల్లా బంద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మురళీ మొర్వాలి కుమారుడు కరన్‌ మొర్వాలి. అతను జిల్లా కాంగ్రెస్‌ యూత్‌ లీడర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు కూడా అదే యువజన కాంగ్రెస్‌ నాయకురాలు కావడం విశేషం.
 
వీరిద్దరూ గత యేడాది కలుసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని కరన్ మొర్వాలి నమ్మించాడు. ఓ రోజున నగరంలోని హోటల్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీంతో ఎమ్మెల్యే మురళి, అతని కుమారుడు కరన్‌పై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి జ్యోతి శర్మ వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు