ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి ఇరానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందుకే, ఆయనకు భద్రత కల్పిస్తున్నామని ముంబయి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులకు మాఫియా బెదిరింపులు వస్తున్నాయి. నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట కొందరు కాల్పులు కూడా జరిపారు. షారూఖ్ ఖాన్కు సైతం బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఇరానీకి అదే తరహాలో ఫోన్ కాల్స్ రావడం గమనార్హం.