తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌కు చెందిన ముగ్గురు కుర్రాళ్లు బైక్‌లపై స్టంట్స్ చేస్తున్నారు. దీన్ని గమనించిన ఓ స్థానికుడు ఆ కుర్రాళ్లను అడ్డగించి, తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు.
అంతే ఆ కుర్రాళ్లకు కోపం వచ్చేసింది. అతనిపై దాడికి తెగబడి కత్తితో 28సార్లు పొడిచేశారు. ఫలితంగా ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తర్వాత బైక్ స్టంట్స్‌కు పాల్పడటమే కాకుండా, ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు.