ఈ సందర్భంగా మొహసిన్ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ‘నేను పెళ్లయిన తర్వాత పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చాను. ఇక్కడ నాకు బంధువులెవరూ లేరు. నేను నా భర్తతో కలిసి మోడీని కలిశాను. అప్పుడు ఆయన ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉండేవారు. రక్షాభంధన్ రోజునే మోడీని కలుసుకోవడం జరిగింది. దీంతో వెంటనే మోడీకి రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యాను. ఆయన ఎంతో ఆనందంగా తన చేతిని చాపి రాఖీ కట్టించుకున్నారు.
అప్పుడే మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం బలపడింది. అప్పటి నుంచి ప్రతీ యేటా మోడీకి రాఖీ కడుతూ వస్తున్నాను. ఎన్నో పరిణామాల తరువాత మోడీ.. ప్రధాని స్థాయికి ఎదిగారు. అయినా మా అనుభంధం మారిపోలేదు. అయితే ఈ సారి మోడీ చాలా బిజీగా ఉన్నారు. అయినా రెండు రోజుల క్రితం ఆయన ఫోన్‌చేసి క్షేమ సమాచారం అడిగి, రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.