మొబైల్ నంబర్లకు తప్పనిసరిగా ఆధార్ నెంబరును అనుసంధానం చేయాలని, వారి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుల గుర్తింపునకు సంబంధించి కూడా వివరాలు తీసుకోవాలని కోర్టు తెలిపింది.
మొబైల్ వినియోగదారుల వెరిఫికేషన్ అనేది ఎంతో ప్రధానమైందని, దేశంలో ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నారని, అందువల్ల విధిగా వారి వివరాలను సేకరించాల్సిందేనంటూ ఎన్జీఓ లోక్ నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.