ఇంటి బాత్రూంలో 30 పిల్లలకు జన్మనిచ్చిన నాగుపాము

సోమవారం, 23 మే 2016 (16:38 IST)
పామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఒక పాము మన ఇంటిలో కనిపిస్తే.. ఇంట్లో నుంచి ప్రాణభయంతో బయటకు పరుగుపెడతాం. అటువంటిది 30 పాములు ఒకేసారి ఇంట్లోకి వస్తే గుండెపోటు రాదు. 
 
హర్యానా రాష్ట్రంలోని కర్నల్ గ్రామంలో ఓ ఇంట్లో ఇలాంటి ఒళ్లుగగుర్పొడిచే సంఘటన ఒకటి జరిగింది. ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక నాగు పాము 30 పిల్లలకు జన్మనిచ్చింది. 
 
దీంతో ఆ ఇంటి యజమానికి నోటమాట రాలేదు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించాడు. పాములు పట్టేవారు వచ్చి 30 నాగు పాములను డబ్బాలో సేకరించి స్థానిక అటవీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. 
 

వెబ్దునియా పై చదవండి