ఆరేళ్లపాటు సహజీవనం.. వేరొక యువతితో పెళ్లి.. సినీ ఫక్కీలో పోలీసుల అరెస్ట్.. ఎక్కడ?

శనివారం, 6 మే 2017 (11:56 IST)
పెళ్లి చేసుకునేందుకు పెళ్లికొడుకుగా ముస్తాబైన వరుడు.. వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అయ్యాడు. అయితే అక్కడే అసలు సీన్ ప్రారంభమైంది. ఆ సమయంలో సినీ ఫక్కీలో అక్కడికి యూనిఫాంలో ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి... అత్యాచారం కేసులో నిందితుడైన వరుడి చేతికి బేడీలు వేసి అరెస్టు చేసి తీసుకువెళ్లిపోయారు.

దీంతో మరికొద్ది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ముంబైలోని శివారు ప్రాంతమైన భైసర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బైసర్ నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన బంధువైన 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లుగా సహజీవనం చేశాడు.  చిన్ననాటి నుంచే పరిచయం కలిగిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనున్నారు. కానీ సహజీవనం చేసిన వ్యక్తి వేరొక యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో.. సహజీవనం చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పెళ్లి చేసుకుంటానని ఆరేళ్లుగా తనపై అత్యాచారం జరిపిన వరుడిపై యువతి కేసు పెట్టింది. దీంతో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి పెళ్లి వేడుకలో ఉన్న వరుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు.

వెబ్దునియా పై చదవండి