నాగాలాండ్ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షురోజెలీ లీజీట్స్‌పై 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలంతా కాజీరంగా సమీపంలోని ఓ రిజార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాగాలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య ప్రస్తుతం కోహిమాలో లేకపోవడంతో ఆయన రాక కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి షురోజెలీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తన కుమారుడి చేత రాజీనామా చేయించి, ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆయన కుమారుడు ఖ్రీయిహు గత నెలలోనే రాజీనామా చేశారు.