నాగ్‌పూర్ నగరంలో వరుసగా మూడో రోజు కరోనా మరణాలు సంభవించలేదు. ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు నాగ్‌పూర్ జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ గత రెండు రోజుల్లో(శుక్ర, శనివారాలు) ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆదివారంనాడు ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఎవరూ కూడా నాగ్‌పూర్‌లో కొవిడ్ కారణంగా మరణించలేదు.
2020 జులై 6 తర్వాత ఆ జిల్లాలో కొవిడ్ మరణం నమోదుకాకపోవడం ఇదే తొలిసారి. ఆ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,76,761 కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 907గా ఉంది. చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 1000 కంటే దిగువునకు చేరాయి. ఆదివారంనాడు 8857 పరీక్షలు నిర్వహించగా 39 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. నాగ్‌పూర్ జిల్లాలో ఫిబ్రవరి మూడో వారంలో సెకండ్ వేవ్ ప్రారంభంకాగా… ఏప్రిల్ 19న అత్యధికంగా 113 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.