వాట్సప్‌లో ఓ వీడియో చూశానని.. కారులో ఉన్న ఓ పెద్దాయన వద్దకు భిక్షాటన చేస్తూ ఓ యాచకుడు వెళ్లాడట. చిల్లర లేదని చెప్పడంతో వెంటనే ఆ యాచకుడు తన వద్ద ఉన్న స్వైపింగ్ మెషీన్ తీసి డెబిట్ కార్డును స్వైప్ చేయాలని కోరాడని సభలో ప్రధాని చెప్పినప్పుడు ప్రజల నుంచి కరతాళధ్వనులు వినిపించాయి. 70 ఏళ్ల నుంచి దేశంలో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసేందుకు తనతో కలిసి రావాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు
ప్రజలే తనకు హైకమాండ్ అని మోడీ వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దేశంలో పేదరికం నిర్మూలించడమే తన ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ప్రధాని అన్నారు. నల్లధనంపై యుద్ధం ప్రకటించడం పాపం చేసినట్లవుతుందా అని మోడీ ప్రశ్నించారు.