తాజాగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆవు, పంది మాసం తినే నెహ్రూ అసలు పండిటే కాదని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.