నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలి : నేతాజీ మనువడు

సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:22 IST)
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని నెహ్రూ మనువడు చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. చరిత్రకారులు అభిప్రాయాలు కలిగివుండవచ్చని, కానీ, చరిత్రను వక్రీకరించడం తగదని హితవు పలికారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ అడుగు ముందుకేసి, నెహ్రూకిచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలన్నారు. నెహ్రూ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు బాగా తెలుస్తోందని అన్నారు. నేతాజీ‌తో పాటు.. ఆయన బంధువులపై నిఘా వేసినట్టు వార్తలు రావడం దేశంలో కలకలం రేపింది.
 
మరోవైపు నేతాజీ రాసినట్టు చెప్పుకునే ఓ పుస్తకం వెలుగు చూసింది. ఇందులో భారత్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 20 యేళ్ళ వరకు నియంతృత్వ పాలనలో ఉండాలని నేతాజీ కోరుకున్నారు. అభివృద్ధి దేశాలతో పోటీ పడాలంటే ఈతరహా నియంత పాలన తప్పదని ఆయన అందులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి