కరోనా లక్షణాలతో సింహం : ప్రాణంకోల్పోయిన తొమ్మిదేళ్ళ నిలా

శనివారం, 5 జూన్ 2021 (13:24 IST)
కరోనా వైరస్.. ఇప్పటివరకు మనుషులపైనే ప్రభావం చూపిస్తూ వచ్చింది. ఇపుడు జంతువలపైనా కూడా పంజా విసురుతోంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వండలూరులో ఉన్న అన్నా జంతు ప్రదర్శనశాలలోని 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా వైరస్ సోకింది. వీటిలో నిలా అనే తొమ్మిదేళ్ళ ఆడ సింహం కరోనా వైరస్ సోకి ఈ నెల 3వ తేదీన కన్నుమూసింది. మృతి చెందిన ఆడ సింహంతో పాటు.. మిగిలిన 9 సింహాలకు స్వాబ్‌ను సేకరించి పూణె, చెన్నై, హైదరాబాద్, బైరేల్లిలలో ఉన్న జంతు పరిశోధనా ప్రయోగశాలలకు పంపించారు. 
 
అయితే, సింహాలకు సోకిన కరోనా రకం.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే తరహా కాదని అంటున్నారు. కాగా, గత నెలలో హైదరాబాద్‌, లక్నోల్లోని జూలలో సింహాలు కరోనా బారినడ్డాయి. అనంతరం పరిశోధనల్లో ఇది కరోనా వైర్‌సలో ఒక రకం మాత్రమేనని, మనుషులకు సోకేది కాదని తేలిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు