నిఠారి హత్య కేసులో సురీందర్ కోలీని ఉరిశిక్ష సబబే : సుప్రీం

గురువారం, 30 అక్టోబరు 2014 (12:13 IST)
నిఠారి వరుస హత్య కేసులో దోషిగా తేలిన కీలక ముద్దాయి సురీందర్ కోలీకి ఉరిశిక్ష విధించడం సబబేనని, అందువల్ల ఆతనని ఉరితీయవచ్చని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
మరణశిక్ష విధించిన కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తొలిసారిగా జరిగిన కోర్టు బహిరంగ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
కోలీ మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును మళ్లీ సమీక్ష జరపాల్సినంత పొరపాటు ఏదీ జరగలేదని కోర్టు సంతృప్తిచెందినట్టు ధర్మాసనం పేర్కొంటూ ఉరిశిక్షను అమలు చేయవచ్చని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి