ప్రసార మాధ్యమాల్లో ఇష్టానుసారం కండోమ్‌ల ప్రకటనలను వేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటి ప్రభావం పిల్లలపై పడుతోందనీ, అందువల్ల వాటిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రకటనలను నిషేధించాలని ఉత్తర్వులను జారీ చేసింది. కండోమ్ ప్రకటనలు ఉదయం రావడం వల్ల పిల్లలపై దుష్ర్పభావం చూపెడుతోందని తెలిపింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు 1994లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరణ చేస్తూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కండోమ్ యాడ్‌లు వేసుకోవచ్చని తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర సమాచార శాఖ ప్రకటనతో కండోమ్‌లను తయారుచేసే ప్రైవేటు సంస్థలు డీలాపడిపోయాయి.