ఫుట్‌పాత్‌తో నిద్రిస్తున్న వారిని కారుతో తొక్కేసి చంపేసిన కేసు లాగానే, జింకలను వేటాడి చంపాడని కేసులోనూ సల్మాన్ ఖాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో, జింకను సల్మాన్ ఖాన్‌ను చంపకపోతే.. జింక ఎలా చనిపోయింది? అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకూ ఆ జింక ఎలా చనిపోయినట్టు? ఈ ప్రశ్నకు న్యాయమూర్తి తీర్పులో జవాబు లేదు కానీ సోషల్ మీడియాలో నెటిజనులు రకరకాల జవాబులు చెప్పారు.
శ్రుతి మిశ్రా అనే నెటిజన్ ఏమందంటే? సల్మాన్ ఖాన్‌ను చూడగానే సంతోషంతో ఉబ్బితబ్బైపోయిన జింక అతని తుపాకిని లాగేసుకుని తనను తాను కాల్చేసుకుంది.. ఎంత విచిత్రమని ట్వీట్ చేశారు. రోహిత్ శర్మ అనే మరో నెటిజన్ ఇలా రాశారు. ప్రశ్న - ఆటోవాలాల తర్వాత సల్మాన్ అంటే పడి చచ్చే అభిమాను లెవ్వరు? జవాబు - హైకోర్టు జడ్జిలు అన్నారు.
జర్నలిస్టు కూర్మనాథ్ ట్విట్టర్‌లో రాస్తూ, జింకను ఎవ్వరూ చంపలేదు. ఫుట్‌పాత్‌పై పడుకున్న వారినీ ఎవ్వరూ చంప లేదు. వాళ్లు మాయ మైపోయారంతే' అని వ్యాఖ్యానించారు. కవితారెడ్డి ట్వీట్ ఇలా సాగింది.. నల్ల జింకను ఎవ్వరూ చంపలేదు. సల్మాన్‌ను చూడగానే ఆత్మహత్య చేసేసుకుంది అంటూ సెటైర్లు విసిరారు.