భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా.. ఎవరు చెప్పారు.. అద్వానీ కామెంట్స్

బుధవారం, 27 జనవరి 2016 (06:20 IST)
భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్చ లేదంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ కురువృద్ధుడు ఎల్కే. అద్వానీ స్పందించారు. దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదనడం సరికాదని అసలు ఆ సందేహమే రానవసరం లేదన్నారు. పైగా ఈ విషయంపై కొందరు మాట్లాడటం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన నివాసంలో మంగళవారం జెండా వందన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇటీవల ఈ విషయమై కొందరు చేసిన వ్యాఖ్యలతో తాను అంగీకరించబోనన్నారు. 
 
కాగా, దేశంలో అసహనం, వాక్‌స్వాతంత్య్రం అంశాలపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. కొందరు రచయితలు, కళాకారులు తమ అవార్డుల్ని వెనక్కి కూడా ఇచ్చారు. గత వారం జైపూర్‌లో జరిగిన సాహిత్య సదస్సులో దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. భారత్‌లో వాక్‌స్వాతంత్య్రం పెద్ద జోక్‌ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా దీనిపై వివిధ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీపై విధంగా స్పందించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి