అగ్నిపథ్ పథకంపై వెనకుడు లేదు : అజిత్ ధోవల్

మంగళవారం, 21 జూన్ 2022 (15:53 IST)
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పష్టం చేశారు. ఈ పథకంపై అమలుపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో మంగళవారం త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అజిత్ ధోవల్ కూడా పాల్గొననున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ పథకంపై ఆయన స్పందిస్తూ, అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. అగ్నిపథ్ పథకంలో భారత సైన్యం మొత్తం అగ్నివీరులతోనే నిండిపోదని చెప్పారు. రెగ్యులర్ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులకు మరోమారు కఠోర శిక్షణ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా, రెజిమెంట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పారు. 
 
ఇపుడు దేశాల మధ్య యుద్ధ స్వరూపమే మారిపోయిందన్నారు. యుద్ధాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కనిపించని శత్రువుతో టెక్నాలజీ సాయంతో పోరాటం చేయాల్సి ఉందన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు