ఇల్లు అమ్మవద్దన్న సుప్రీం కోర్టు లాయర్.. చంపేసిన భర్త

సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:20 IST)
Woman Lawyer
న్యూఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది రేణు సిన్హా. ఆమె తన భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి ఢిల్లీలోని నోయిడాలోని సెక్టార్ 30లోని వారి సొంత బంగ్లాలో నివసిస్తుంది. వాళ్ల కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. రేణుకు ఒక సోదరుడు ఉన్నాడు. వారు నివసిస్తున్న బంగ్లాను విక్రయించడానికి నితిన్ నాథ్ సిన్హా ధరను బేరమాడారు. దానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఈ అమ్మకానికి రేణు ఒప్పుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే కొద్దిరోజుల క్రితం ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణగా మారింది.
 
నితిన్ నాథ్ సిన్హా ఆవేశంలో రేణును హతమార్చాడు. ఆపై బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని వదిలి పోలీసులకు భయపడి బంగ్లాలోని స్టోరేజీ గదిలో దాక్కున్నాడు. రెండు రోజులుగా తన సోదరిని సంప్రదించేందుకు ప్రయత్నించగా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుండడంతో అనుమానం వచ్చిన రేణు సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో బంగ్లాలో సోదాలు చేసేందుకు వచ్చిన పోలీసులు సోదాలు చేయగా బాత్‌రూమ్‌లో రేణు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆమె భర్తను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. బంగ్లా నుంచి ఆమె సెల్‌ఫోన్ చివరి సిగ్నల్ వస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడి కోసం వెతకగా బంగ్లాలోని కార్గో రూమ్‌లో దాక్కున్నట్లు గుర్తించారు.
 
అతడి వద్ద జరిపిన విచారణలో తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు