కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిపోయిందన్నారు. పార్టీ నేతల్లో ఫైవ్ స్టార్ కల్చర్ బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీని గ్రామీణ, మండల స్థాయి నుంచి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన పార్టీ సీనియర్ నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. ఇపుడు ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోమారు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందన్నారు. పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదన్నారు.
అలాగే, మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై ఆజాద్ స్పందిస్తూ, ఇది నాయకత్వ సమస్య కాదన్నారు. 'నాయకుణ్ణి మార్చేస్తే మనం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచేస్తామనుకుంటే పొరపాటు.