అందుకే పార్టీ పగ్గం ఒకరికి ప్రభుత్వ పాలన ఇంకొకరికి అనే ఫార్ములాతో పన్నీర్ సెల్వం, శశికళ ముందుకు సాగనున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే గురువారం నాడు శశికళతో భేటీ అయిన ముఖ్యమంత్రి మళ్లీ శుక్రవారం నాడు సమావేశం కావడం గమనార్హం. మరోవైపు శశికళ తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే శశికి సీఎం పోస్ట్ ఇస్తే పార్టీ ఊస్టింగ్ అయిపోతుందని చాలామంది బహిరంగంగానే చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పన్నీర్ సెల్వం ఎలా నడుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.