ఓ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గ్రామం నుంచి లేచిపోయారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లి కూలిపని చేసుకుంటూ జీవిస్తూ వచ్చారు. అయితే, కరోనా కష్టాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కానీ, అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ అని వచ్చినా 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. ప్రియురాలు అప్పటికే గర్భవతి కావడంతో ఆ క్వారంటైనే కేంద్రంలోని ఇతర క్వారంటైన్ సహచరుల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాగాడ గ్రామంలో జరిగింది.