దేశంలో ప్రతి అర్థగంటకో అత్యాచారం!

సోమవారం, 28 జులై 2014 (11:50 IST)
మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అడ్డుకట్టకు అనేక కఠిన చట్టాలు అమలవుతున్నాయి. అయినప్పటికీ.. దేశంలో ఈ నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్ఆర్ఐ) సంస్థ 2001 నుంచి 2013 వరకు నిర్వహించిన అధ్యయనం తాలూకు నివేదిక పరిశీలిస్తే భారత్‌లో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. 
 
దేశంలో ప్రతి అర్థగంటకు ఒక అత్యాచారం జరుగుతున్నట్టు సీహెచ్ఆర్ఐ వెల్లడించింది. ఈ పదమూడేళ్ళ కాలంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 2,72,844 అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయని సీహెచ్ఆర్ఐ నివేదిక చెబుతోంది. 2001లో 6,075 రేపులు జరగ్గా... 2013లో 33,077 అత్యాచారాలు జరగడం నివ్వెరపరుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి