అవసరమైతే కూర్చునే వినిపించండి... జైట్లీ పట్ల స్పీకర్ ఊదారత..!

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (14:32 IST)
2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ... ఎన్డీయే ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో మంత్రి అరుణ్ జైట్లీ పట్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ ఊదారతనుప్రదర్శించారు. ఆయన బడ్జెట్ విశేషాలను నిలబడి చదివి వినిపిస్తుండగా కావాలంటే దయచేసి కూర్చుని, బడ్జెట్ పాఠాన్ని చదవండి అని స్పీకర్ మంత్రికి సూచించారు. 
 
అందుకు థ్యాంక్స్ చెప్పిన జైట్లీ, అవసరమైతే తర్వాత కూర్చుంటానని చెప్పారు ఆ తర్వాత 20 నిమిషాలు ప్రసంగం చేసిన అనంతరం స్పీకర్ సూచనను ఆయన పాటించారు. అందుకు కారణంగా గత ఏడాది జూలైలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మధ్యలో ఆయన కూర్చున్నారు. బిజెపి ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత జైట్లీ ఆ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 
 
ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన వెన్ను నొప్పి ఏర్పడడంతో, ఆయన ప్రసంగం మధ్యలోనే కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారు. నెల పాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈ స్థితిలో స్పీకర్ మంత్రికి ఆ సూచన చేశారు.

వెబ్దునియా పై చదవండి