గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలా? : పటేళ్ళ ఆందోళనపై నరేంద్ర మోడీ

ఆదివారం, 30 ఆగస్టు 2015 (12:59 IST)
మహాత్మా గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు పడటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరమన్నారు. గుజరాత్‌లో పెచ్చరిల్లిన అల్లర్లు యావత్ దేశాన్ని బాధించాయని పేర్కొన్నారు.
 
ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం యువ సంచలనం హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ సామాజికవర్గానికి ప్రజలు ఆందోళన చేయడం విచారకరమన్నారు. పైగా.. గత కొన్ని రోజులుగా ‘గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లు దేశ మొత్తాన్ని బాధించాయి. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడంతో పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకరం. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత గుజరాత్‌లో శాంతి వెల్లివిరిసింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, గుజరాత్‌లోని తాజా పరిణామాలు బాధించాయి. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధే. జన్‌ధన్ యోజనకు ఏడాది పూర్తయింది. జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రజలు విజయవంతం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ అవసరం. గ్రామాల్లో విద్యుదీకరణ, కాల్వలు, రహదారుల నిర్మాణాల కోసం భూసేకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. జై జవాన్, జై కిసాన్ అనేది నినాదం మాత్రమే కాదు. అది ఒక మంత్రమని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి