సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నవారికి మధ్య ఘర్షణలు రేగడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓవైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా.. మరోవైపు ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. జఫ్రాబాద్.. మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీస్ మరణించాడు.