ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యం

సోమవారం, 26 జనవరి 2015 (06:28 IST)
ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఎక్కడ మహిళలకు అభివృద్ధి చెందుతారో అక్కడ ఆ దేశం లేదా ఆ ప్రాంతం నిలదొక్కుకోగలుగుతుందనీ అన్నారు. ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ అప్పగించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 
 
ఐకమత్యమే భారత్ బలమని చెప్పారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం ప్రజాస్వామ్యానికి ఓ పరీక్ష అని ప్రణబ్ అన్నారు.  రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం ఉదయం భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఒబామాకు విందు ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి