ఈ ఉద్యమం చేపట్టిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్దిక్ పటేల్ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఈ వివాదాలపై అతడితో పాటు అతడికి సంబంధం లేని వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితే ప్రవీణ్ భాయ్ తొగాడియాకు ఎదురైంది. గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ భాయ్ తొగాడియాకు హార్దిక్ పటేల్ అత్యంత సన్నిహతుడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.