ఆ రైల్వే స్టేషన్కు వెళితే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలోని రవీంద్రసరోవర్ మెట్రో రైల్వే స్టేషన్. ఈ స్టేషన్కు వెళ్లే చాలా మంది ప్రయాణికులకు మానసిక స్థితి బాగానే ఉన్నాగానీ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట.
ఇలా ఎందుకు అనిపిస్తుందనే విషయాన్ని పలువురు ప్రయాణికులను ప్రశ్నిస్తే... ఈ మెట్రో రైల్వేస్టేషన్లో ఇలా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక్కడ ఆత్మలు, దయ్యాలు లాంటివి కనిపిస్తాయని ఎందరో ప్రయాణీకులు, రైల్వే ఉద్యోగులు కూడా చెబుతుంటారు. కొంతమంది వీటిని నమ్మకుండా కొట్టిపడే స్తారు. అయినప్పటికీ ఈ రైల్వే స్టేషనకి వెళితే మాత్రం చాలా మందికి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం జరిగిందని చెబుతారు.