వివాదాస్పద సాధ్వి రాధే మాపై రోజు రోజుకి కేసులు ఎక్కువవుతున్నాయి. ఇటీవల రాధే మాతో పాటు ఆమె అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ బిగ్ బాస్ ఫేమ్ నటి డాలీ బింద్రా మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి రాధే మాపై బింద్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ కొత్త వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలంటూ రాధే మా తనను బలవంతం చేసిందని ఆరోపించారు.
ఈ మేరకు ముంబై పోలీసులకు బింద్రా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా రాధే మా సత్సంగ్ ఆశ్రమంలో ఇలాంటి దారుణాలు సర్వసాధారణమని ఫిర్యాదులో తెలిపారు. "ఓసారి రాధే మా తనయుడు, మరో అనుచరుడు భక్తుల ముందు నన్ను వేధించే యత్నం చేశారు" అని వివరించారు.