ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను ఆప్ నేతలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలనుకాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.